Wed Mar 25 2026 18:59:40 GMT+0530 (India Standard Time)
రోజుకు 15 గంటలు కష్టపడుతున్నా

తన శాఖలో అవినీతి జరిగిందని చెప్పడం బీజేపీ నేతలకు సరికాదని మంత్రి నారాలోకేష్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలపై లోకేష్ స్పందించారు. తనకు కేంద్ర ప్రభుత్వం 20 అవార్డులు ఎందుకిస్తుందని ప్రశ్నించారు. బీజేపీ పాలిత 21 రాష్ఠ్రాలకు రాకుండా ఏపీకే ఆ అవార్డులు ఎలా దక్కాయన్నారు. మంచినీటి ట్యాంకర్ల విషయంలో అవినీతి జరిగిందనడం అవాస్తవమని చెప్పారు. తాను పదిహేను గంటలు రోజుకు కష్టపడుతున్నానని, ఏం జరిగినా తన డ్యాష్ బోర్డులో కన్పిస్తుంటుందని లోకేష్ చెప్పారు. తప్పులుంటే బీజేపీ నేతలు చెప్పాలని, తాను సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని లోకేష్ చెప్పారు.
Next Story

