Sat Apr 11 2026 20:09:12 GMT+0530 (India Standard Time)
రేవంత్ రాజీనామాపై చంద్రబాబు స్పందన ఇదే

రేవంత్ రెడ్డి రాజీనామాపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. మీడియా సమావేశం తర్వాత మాట్లాడదామని రేవంత్ తో చెప్పానని, ఆయన వినకుండా వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతుంటాయని, అవసరాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని, పార్టీలోకి వచ్చే వారు వస్తుంటారని, వెళ్లే వారు వెళ్తుంటారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా రేవంత్ చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ సీఎం పేషీలో తన రాజీనామా లేఖను ఇచ్చి హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
- Tags
- రేవంత్ చంద్రబాబు
Next Story

