Mon Apr 06 2026 22:12:43 GMT+0530 (India Standard Time)
రేపు శుక్రవారమైనా... జగన పాదయాత్ర చేస్తున్నారు...!

మామూలుగా ప్రతి శుక్రవారం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. దీంతో ప్రతి శుక్రవారం జగన్ పాదయాత్రకు ఒకరోజు విరామమిచ్చి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. పాదయాత్ర నవంబరు 6వ తేదీని ప్రారంభమైతే ఇప్పటికి మూడు శుక్రవారాలు జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కాని రేపు శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావడం లేదు. పాదయాత్రను కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కోర్టుకు కూడా రేపు సెలవు దినం కావడంతో ఈ శుక్రవారం జగన్ పాదయాత్రలోనే ఉంటారని వైసీపీ వర్గాలు చెప్పాయి.
- Tags
- జగన్
Next Story

