Fri Mar 27 2026 05:32:18 GMT+0530 (India Standard Time)
రేపు ట్యాంక్ బండ్ మూసివేత

రేపు ట్యాంక్ బండ్ ను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిలియన్ మార్చిజరిగిన రోజు సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ట్యాంక్ బండ్ పై సభ జరపాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సభకు పోలీసులు అనుమతివ్వలేదు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లిస్తారు. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం5 గంటల వరకూ ట్యాంక్ బండ్ ను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా అనుమతి లేకుండా ట్యాంక్ బండ్ పైకి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
- Tags
- ట్యాంక్ బండ్
Next Story

