Fri Apr 10 2026 21:15:00 GMT+0530 (India Standard Time)
రాహుల్ తో రాములమ్మ ముచ్చట్లు

రాములమ్మ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని విజయశాంతి రాహుల్ కు చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని రాహుల్ తో విజయశాంతి చెప్పినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న విజయశాంతి ఇటీవలే తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాను కలిశారు. ఇకపై తాను పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయిస్తానని విజయశాంతి చెప్పారు. ఈ సమావేశంలో కుంతియాతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. విజయశాంతి రీ ఎంట్రీతో కాంగ్రెస్ కు కొంత మైలేజీ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
- Tags
- విజయశాంతి
Next Story

