Thu Apr 02 2026 08:42:34 GMT+0530 (India Standard Time)
రాహుల్ కీలక నిర్ణయం...ఉత్తమ్ సేఫ్

పీసీసీ కమిటీల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవని ఏఐసీసీ కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్షులు, కార్యవర్గమే కొనసాగుతారని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం కూడా పూర్తి కావడంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తారనుకున్నారు. ఇందుకోసం సీనియర్ నేత జానారెడ్డి నుంచి డీకే అరుణ, కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. అయితే రాహుల్ తాజా నిర్ణయంతో ఉత్తమ్ పదవి సేఫ్ అని తేలింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరాశలో మునిగిపోయారు. ఉత్తమ్ అనుచరులు మాత్రం ఈ ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు.
- Tags
- రాహుల్
Next Story

