రామసేతు రాముడు నిర్మించిందేనా?

రావణుడు ఎత్తుకెళ్లిన సీతను తీసుకొచ్చేందుకు శ్రీరాముడు లంకకు వెళ్లారు. లంకకు వెళ్లాలంటే వారధిని నిర్మించాలి. అందుకోసం వానరుల సాయంతో పాటు ఉడతల సాయం కూడా వారధి నిర్మాణంలో ఉంది. ఇది మనం పురాణాల్లో విన్నాం. ఊహించుకున్నాం. రామాయణంలో వారధి నిర్మాణానికి ప్రత్యేకత ఉంది. ఇది కొందరు బలంగా విశ్వసిస్తారు. మరి కొందరు కొట్టిపారేస్తారు. ఇదంతా ఎందుకంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మితమేనని తేలింది. ఆ తేల్చింది ఎవరో కాదు అమెరికన్ సైన్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసాం చేసింది. భారతదేశానికి, శ్రీలంకు మధ్య ఉన్న రామసేతు వారధి మానవులు నిర్మించిందేనని ఈ ఛానల్ ప్రసారం చేసింది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకూ ఈ వారధి నిర్మితమైంది. ఈ వారధిని నిర్మించింది రాముడి హయాంలోనేనని బీజేపీ ఇప్పటికీ వాదిస్తుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవన్ దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి రామసేతు నిర్మాణం మానవనిర్మితమేనన్నది ఆయన చెబుతూ వస్తున్నారు. కాని బీజేపీ రాముడి పార్టీ అని కొందరు దీన్ని ఎద్దేవా చేశారు.
సైన్స్ ఛానల్ ఏం చెప్పిందంటే...
అయితే తాజాగా అమెరికన్ సైన్స్ ఛానల్ ఇది మానవనిర్మిత కట్టడమేనని కథనం ప్రసారం చేయడంతో మరోసారి రామసేతు వారధి వార్తల్లోకెక్కింది. ఇది పూర్తిగా సున్నపురాయితో నిర్మించిన నిర్మాణమని తేల్చింది. ఈ వారధి గురించి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలను రప్పించి 30 కిలోమీటర్లు పరిశోధనచేశారు. ఇందులో వాడిన రాళ్లు నీటిలో తేలుతున్నాయని, ఇసుక బలంతో ధృఢంగా నిలిచాయని సైన్స్ ఛానల్ కథనం ప్రసారంచేసింది. భారతీయులు రామాయణాన్ని విశ్వసిస్తారు. దాదాపు కోటి మంది వానరులు ఐదు రోజుల్లోనే ఈ వారధిని నిర్మించారని రామాయణంలో పేర్కొన్నారు. ఈ వారధిపై కొంతకాలం నడక కూడా సాగించేవారట. అయితే 1480లో తుఫానుతో ఈ వంతెన ధ్వంసమైందని చరిత్ర కారులు చెబుతున్నారు. 2002లో నే నాసా అంతరిక్షం నుంచి తీసిన చిత్రం కూడా రామసేతు స్పష్టంగా కన్పించింది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఈ వారధిని రాముడి హయాంలోనే నిర్మించారని చెబుతోంది. మొత్తం మీద మరోసారి రామసేతు వార్తల్లోకి ఎక్కింది.
- Tags
- రామసేతు

