యువీకి భంగపాటు, పాండ్యాకు టెస్ట్ జట్టులో తొలిసారి చోటు

ఇంగ్లాండ్ తో భారత్ అడనున్న క్రికెట్ సిరీస్ కు సంబంధించి సెలక్షన్ కమిటీ బుధవారం తాము ఎంపిక చేసిన జట్టును ప్రకటించింది. యువరాజ్ సింగ్ అభిమానులకు మరొకసారి నిరాశ ఎదురైంది. టెస్ట్ జట్టులో యువీకి చోటు దక్కలేదు. అయితే చాలాకాలం తరవాత ఇటీవలే టెస్ట్ జట్టులో చోటు దక్కించుకుని, కివీస్ తో సిరీస్ లో అనారోగ్యం కారణంగా సద్వినియోగం చేసుకోలేకపోయిన గౌతమ్ గంభీర్ కు ల అవకాశం కల్పించారు. అలాగే.. భారత క్రికెట్ ప్రపంచంలో ఇటీవలి సంచలనం హర్డిక్ పాండ్య కు కూడా చోటు లభించింది. గాయాల కారణంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాహుల్ లను కూడా పక్కన పెట్టారు. మళ్ళీ భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు మనతో మొత్తం 5 టెస్టులు, 3 వన్ డే లు, 2 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. అయితే సెలక్షన్ కమిటీ బుధవారం నాడే 3 ఫార్మాట్ లకు సంబంధించి, మన జట్లు అన్నిటిని ప్రకటిస్తుందని అనుకున్నారు. అయితే కేవలం రెండు టెస్టు లకు మాత్రమే సభ్యులని ప్రకటించారు.
అయితే ఎంపికలో కమిటీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అనుకోవాలి. 2 టెస్టుల తరవాత ఫామ్ ను బట్టి, రిజల్ట్ ను బట్టి మిగిలిన టెస్టులకు జట్టును ప్రకటిస్తారు.

