Tue Mar 31 2026 21:58:03 GMT+0530 (India Standard Time)
యాంకర్ ప్రదీప్ కు ఎలాంటి శిక్ష అంటే...!

తప్పతాగి డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కయిన యాంకర్ ప్రదీప్ కు కోర్టు తీర్పు చెప్పింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో పాటు రూ.2100 జరిమానా విధించింది. అంటే మూడేళ్ల పాటు ఆయన వాహనం నడిపేందుకు వీలుండదు. యాంకర్ ప్రదీప్ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన పూటుగా మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో జరిపిన బ్రీత్ ఎనలైజర్ ట్రెస్ట్ లో ప్రదీప్ కు 178 పాయింట్లు రావడంతో పోలీసులే షాక్ అయ్యారు. అయితే ప్రదీప్ కు కౌన్సిలింగ్ ఇటీవలే పూర్తయింది. దీంతో ప్రదీప్ ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులకు తన డ్రైవింగ్ లైసెన్సు ను కూడా ఇచ్చేశారు ప్రదీప్. ప్రదీప్ ఈ కేసులో ఎటువంటి శిక్ష పడకపోవడంతో కొంత ఊరట లభించింది.
- Tags
- ప్రదీప్
Next Story

