మోదీ అదే సాంప్రదాయం : జవాన్లతోనే దీవాళి!

ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ అదే సాంప్రదాయాన్ని పాటించారు. ఎంతో వేడుకగా జరుపుకునే దీపావళి పర్వదినాన్ని ఆయన జవాన్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి పర్వదినాన్ని సరిహద్దుల్లోని సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం.. విశేషం. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూర్ లో జవాన్లను కలిసిన మోదీ వారికి మిఠాయిలు తినిపించారు. వారితో కలిసి ఫోటోలు దిగి ట్విటర్ ద్వారా అందరితో పంచుకున్నారు. మోదీ ప్రధాని అయినప్పటినుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గత రెండేళ్లు కూడా ఆయన సరిహద్దుల్లో జవాన్లతోనే దీపావళి జరుపుకున్నారు. 2001లో అయితే.. భూకంప బాధితులతో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు.
అంతకుముందు మన్‌కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. జవాన్లకు మద్దతుగా దేశమంతా దీపాలు కూడా వెలిగించాలంటూ పిలుపు ఇచ్చారు. ఈ ఏడాది దీపావళిని జవాన్లకు అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
స్వయానా మోదీ నేతృత్వంలో సందేశ్ 2 సోల్జర్స్ పేరిట సేకరించిన దీపావళి శుభాకాంక్షలను కూడా ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

