Tue Mar 31 2026 20:12:06 GMT+0530 (India Standard Time)
మోత్కుపల్లి హాజరుకాలేదెందుకో...!

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించేందుకే ఈసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశరెడ్డి హాజరయ్యారు. ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన మోత్కుపల్లి మాత్రం గైర్హాజరయ్యారు. మోత్కుపల్లి ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పొలిట్ బ్యూరో సమావేశం ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతుంది.
- Tags
- మోత్కుపల్లి
Next Story

