Mon Apr 06 2026 01:00:10 GMT+0530 (India Standard Time)
మోడీ భార్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తానందా?

గుజరాత్ లో కాంగ్రెస్ గెలవడానికి అన్ని దారులూ వెతికింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ సతీమణి జసోదాబెన్ ను కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయించడానికి నేతలు ప్రయత్నించారు. అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. ఈ విషయాన్ని జసోదాబెన్ తోటికోడలు బయటకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మోడీ భార్య అయినప్పటికీ జసోదాబెన్ సాదాసీదా మహిళగానే జీవిస్తున్నారు. మోడీని అనేకసార్లు ప్రశంసలతో ముంచెత్తారు కూడా. నోట్ల రద్దు సమయంలోనూ ఆమె మోడీకి అనుకూలంగానే మాట్లాడారు. మొత్తం మీద గుజరాత్ లో మోడీని దెబ్బతీయానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నించిందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
- Tags
- మోడీ
Next Story

