Wed Mar 25 2026 14:50:50 GMT+0530 (India Standard Time)
మోడీ, అమిత్ షాలను ఎండగట్టండి

నలభై ఏళ్ల రాజకీయ జీవితం తనదని, వాళ్లకంటే ముందుగానే తాను సీఎం అయ్యానన్న విషయాన్ని వాళ్లకు గుర్తు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో అన్నారు. ఆయన ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని సూచించారు. గతంలోనే తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని, చిన్న మచ్చ కూడా లేని తనపై నిందలు వేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. మనల్ని విమర్శించనంత వరకూ అంశాల వారిగా విమర్శిద్దామని, వ్యక్తిగత విమర్శలకు దిగితే మోడీ, అమిత్ షాలను కూడా వదిలిపెట్టొద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీలో కొత్త సంస్కృతి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Next Story

