మోడీ అనుకున్నది సాధిస్తారా?

గుజరాత్ ఎన్నికలను ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేననిఆయన పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి అధికారంలో ఉండటంతో బీజేపీ సర్కార్ పై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. అందులో మోడీ గుజరాత్ ను వీడిరావడం కూడా పార్టీక మైనస్ పాయింట్ అని చెప్పకతప్పదు. మోడీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులిద్దరిపైనా కొన్ని అవినీతి మరకలు అంటుకున్నాయి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో తనకు కేంద్రం సహకరించడం లేదని మోడీ విమర్శించేవారు. అయితే ఇప్పుడు తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్. అందులో ప్రధానిగా ఉంది ఆ రాష్ట్రానికి చెందిన మోడీయే. దీంతో బీజేపీ పాలనపై కొంత వ్యతిరేకతను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎలాగైనా గుజరాత్ గద్దెను చేజిక్కించుకోవాలన్న కసితో మోడీ ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పాలయితే వచ్చే లోక్ సభ ఎన్నికలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పార్టీలోనూ తమపై వ్యతిరేకత పెరుగుతుంది. అందుకోసం గుజరాత్ గెలుపును మోడీ సవాల్ గా తీసుకున్నారు.
33 చోట్ల బహిరంగ సభలు...
ఇందుకోసం గుజరాత్ రాష్ట్రంలో ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు మోడీ గుజరాత్ లో నాలుగుసార్లు పర్యటించారు. కొన్ని కీలకమైన కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అయితే గుజరాత్ తొలిదశ ఎన్నిక డిసెంబర్ 9వ తేదీన జరుగుతుంది. దీంతో ఈ నెల 20 తర్వాత విస్తృతంగా మోడీ గుజరాత్ లో పర్యటించనున్నారు. మొత్తం 33 జిల్లాల్లో మోడీ పర్యటన ఉండేలా పార్టీ రాష్ట్ర శాఖ ప్లాన్ చేస్తుంది. ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. అంటే 33 బహిరంగ సభల్లో మోడీ ప్రసంగిస్తారు. మోడీ ప్రసంగాలు మామూలుగా ఉండవన్న సంగతి అందరికీ తెలిసిందే. మోడీ ప్రసంగంతో అసంతృప్తితో ఉన్న ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు వీలుంటుందన్నది బీజేపీ నేతల ఆలోచన. అందుకే ప్రధాని మోడీ దాదాపు 33 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
- Tags
- మోడీ

