మోడీని నమ్మారన్న అమిత్ షా

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీని, మోడీని ప్రజలు నమ్మారని అర్ధమవుతుందన్నారు. కోట్లాది మంది కార్యకర్తల కృషి తోనే ఈ గెలుపు సాధ్యమయిందన్నారు. గుజరాత్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారన్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తుందన్నారు. గుజరాత్ లో కులం కార్డుతో గెలవాలన్న కాంగ్రెస్ ఆలోచనను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఇప్పటికి దేశంలో పధ్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులున్నారని, ఐదు రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులున్నారని అమిత్ షా చెప్పారు. రానున్న రోజుల్లో నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ,త్రిపురల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- అమిత్ షా

