Mon May 29 2023 19:09:44 GMT+0000 (Coordinated Universal Time)
మోడి పై శివతాండవం

ప్రధాని మోడి తీరును శివసేన తప్పుపట్టింది. అలయన్స్ పార్టీగా ఉన్న శివసేన ఇటీవల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తోంది. తాజాగా ప్రధాని మోదీ పాకిస్థాని ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని శివసేన ఖండించింది. తన పత్రిక సామ్నాలో మోడీ తీరును ఎండగట్టింది. ఛత్రపతి శివాజీ వంటి వారు కూడా దేశానికి శత్రువులైన వారి పట్ల ఇలా వ్యవహరించి ఉండేవారు కారని శివసేన పేర్కొంది. దేశ సరిహద్దుల్లో పాక్ బలగాలు దాడికి తెగబడుూత భారత సైనికులను హతమారుస్తుంటే.. మోదీ పాక్ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమేంటని ప్రశ్నించింది.
Next Story