మొత్తానికి లోకేష్ నోరు విప్పారు

ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కోసం గత రెండు మూడు వారాలుగా ప్రజల్లోను పొలిటికల్ సర్కిల్స్ లో వేడి వేడి వాతావరణమే నడుస్తుంది. ఇలాంటి కీలక సమయాల్లో కేంద్రం చేస్తున్న దగాపై ఏదో ఒక వేదికపై గళం విప్పాలిసిన ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ స్పందించనే లేదు. ఆయన మాట్లాడితే మైలేజ్ కన్నా మైనస్ లో పడతామని అధినేత ఆందోళన చెంది సుపుత్రుని కంట్రోల్ చేసినట్లు టాక్. దాంతో లోకేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఎట్టకేలకు నోరు తెరిచిన చిన్నబాబు.....
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో చిన్నబాబు బిజెపి సర్కార్ మోసాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తానన్న హామీలు అమలు చేయకపోతే అభివృద్ధిలో వెనుకబడతామాన్నారు లోకేష్. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కోరారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. మొత్తానికి కీలక సమయంలో తన కుమారుడు లోకేశ్ ఎంటర్ అయ్యేలా చేశారు బాబు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేదని కేంద్రం వైఖరితో అదికూడా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు చినబాబు
- Tags
- లోకేష్

