Tue Mar 31 2026 12:43:28 GMT+0530 (India Standard Time)
మెట్రో స్టేషన్లో 20 బుల్లెట్లను స్వాధీనం

ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక బ్యాగ్‌లో 20 బుల్లెట్లను తీసుకెళ్తున్న మహిళను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌కు చెందిన ఆమె బుల్లెట్లను తీసుకెళ్తుండగా, ఆదర్శనగర్ స్టేషన్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు గుర్తించి బ్యాగ్‌ను తనిఖీ చేశారని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆమె ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఆమె తండ్రి ఆయుధాలకు సంబంధించిన లైసెన్స్ కాపీని చూపించారని, ఈ 20 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఆయనకు సంబంధించినవేనని పోలీసులు పేర్కొన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీ మెట్రో, ఇతర ప్రజా రవాణా సదుపాయాలు భద్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
- Tags
- ఢిల్లీ మెట్రో
Next Story

