ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకున్న మాల్యా

వేలకోట్ల రూపాయలు బ్యాంక్ లకు ఎగనామం పెట్టి లండన్ లో విలాసవంతంగా గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ మాల్యా మూడో పెళ్ళి చేసుకున్నాడు, ఇప్పటికే రెండు పెళ్లిళ్లు వెలగబెట్టిన ఈ బ్యాంక్ దొంగ కి ఆరుపదుల వయసులో పెళ్ళి అవసరమైంది. గతంలో తాను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం ఇచ్చిన పింకీ ని మనువాడేశాడు ముసలాడు. మాల్యా రెండో భార్య కూడా ఎయిర్ హోస్టెస్ కావడం విశేషం. వాస్తవానికి మాల్యా పింకీతో చాలాకాలంగా డేటింగ్ చేస్తున్నాడు.
పింకీ సాయానికి ప్రతిఫలంగా...
లండన్ లో కూడా అనేక కేసులు ఎదుర్కొంటున్న మాల్యా కి పింకీ చేదోడు వాదోడుగా నిలిచింది. దాంతో ఆమెపై ప్రేమ పొంగి పొర్లడంతో దొర ఆమెతో ఏడడుగులు నడవాలని డిసైడ్ అయ్యాడు. ఒక పక్క భారత్ లో దర్యాప్తు సంస్థలు కోర్టు లు మాల్యా ఎప్పుడన్నా ఇండియా తిరిగి రాకపోతాడా? లోపల పడేద్దామని ఆశగా ఎదురు చూస్తున్నాయి. లండన్ లో వున్న చట్టాల రీత్యా, ఇరు దేశాలనడుమ నేరస్థుల అప్పగింతలు ఒప్పందాలు లేని నేపథ్యంలో దేశంలో మోసాలు చేస్తున్న వైట్ కాలర్ నేరగాళ్లు విదేశాలకు తరలిపోతున్నారు. వారు దేశం దాటాక కానీ ఇక్కడి దర్యాప్తు సంస్థలు ఆ మోసాలను గుర్తించలేక పోవడంతో ప్రభుత్వం ప్రజల్లో నవ్వుల పాలౌతుంది. విజయ మాల్యా మూడో పెళ్ళి ఇప్పడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
