Thu Mar 26 2026 08:48:01 GMT+0530 (India Standard Time)
ముగ్గురూ ఒకే చోట

ఉగాది రోజున ముగ్గురు నేతలు అక్కడే ఉన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరులో ఎస్సీ కాలనీలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ సయితం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఉగాది రోజు జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. మూడు ప్రధాన పార్టీల అధినేతలూ ఏపీ రాజధానికి సమీపంలోనే ఉండి ఉగాది వేడుకల్లో పాల్గొనడం విశేషం.
Next Story

