ముందస్తు ఎన్నికలకు అదే గ్రీన్ సిగ్నల్ ....?

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ముందస్తు ఎన్నికలకు సేనలను సిద్ధం చేసుకుంటున్నాయి. కారణం మోదీసర్కార్ ఒకే దేశం, ఒకే ఎన్నికల నినాదం చేయడంతో బాటు వచ్చే వేసవికి ముందే, ప్రజా తీర్పు కి వెళ్లాలన్న వ్యూహంతో కమల దళం సాగడమే. అయితే ఈ ఎన్నికలకు వెళ్ళేముందు గుజరాత్ గెలుపు బిజెపికి కిక్ ఇవ్వనుంది. ఆ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని అప్పడు కమలం ముందస్తుకు పిలుపు ఇస్తుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ గుజరాత్ లో ఓటమి ఎదురైతే మాత్రం ముందస్తు కి మోడీ , షా ల ద్వయం పూర్తి కాలం పదవిలో ఉంటుందంటున్నారు.
జమిలి ఎన్నికలకు ఈ ట్రిప్ ఛాన్స్ లేదా ...
ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరుతో బిజెపి జమిలి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా హడావిడి చేసింది. అసెంబ్లీ పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలని అనుకున్న బిజెపికి అది సాధ్యం అయ్యే పని కాదని తేలింది. మెజారిటీ విశ్లేషకులు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టారు . పైగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రక్రియ ఉందని అంతా విమర్శించారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడం అంత సులువు కాదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రస్తావన బిజెపి తెచ్చినా ఈ టర్మ్ అమలు చేసే ఛాన్స్ లేదు.

