Tue Feb 03 2026 12:15:20 GMT+0000 (Coordinated Universal Time)
మీరా మాకు నీతులు చెప్పేది

కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారని బీజేపీ మరోసారి టీడీపీని దుయ్యబట్టింది. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన బీజేపీ అధికార ప్రతనిధి నరసింహారావు అంచనాలకు మించి కేంద్రం నిధులను ఏపీకి ఇచ్చిందన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకున్న మీరు మాకు నీతులు చెబుతారా? అని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం పెట్టింది అఖిలపక్ష సమావేశం కాదని అఖిల పరిహాసమన్నారు. యూసీలు అడిగితే ఏపీ సర్కార్ కుభయమెందుకని ప్రశ్నించారు. అవాస్తవాల నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అఖిలపక్ష సమావేశం పెట్టారన్నారు.
Next Story
