మావోయిస్టు పార్టీ బలహీన పడిందా?

మావోయిస్టు కంచుకోటకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ విధి విధానాలు నచ్చక అగ్రనేత జంపన్న పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. ఆయన లొంగుబాటుతో పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జంపన్న దంపతులతో పాటు మరో కమిటీ సభ్యురాలు నిర్మల్ ఎస్పీ ముందులొంగిపోవడం మావోయిస్టు అగ్రనేతలకు మింగుడు పడని వ్యవహారమైపోయింది. జంపన్న తరహాలో మిగతా వ్యక్తులంతా లొంగిపోవాలని తెలంగాణ డిజిపి మహేంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న, భార్య రజిత పేరుగాంచిన మావోయిస్ట్ లు. 33 ఏళ్ళ అజ్ణాత జీవితం వీడి జనజీవన స్రవంతి లో కలిసారు. వీరిది మహబూబాబాద్ లోని తొర్రూర్ మండలం స్వస్థలం .మల్లేపల్లి లో ఐటీఐ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ కార్యక్రమాలకు జంపన్న ఆకర్షితులయ్యాడు. 1984 లో పీపుల్స్ వార్ లో చేరి దాదాపు 33 ఏళ్లు మావోయిస్ట్ పార్టీలో వివిధ హోదాల్లో కీలక పాత్ర పోషించారు. ఇతనిపై మొత్తం వంద కేసులున్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలోనే 51 కేసులు నమోదైఉన్నాయి. మొదట మహదేవ్ పూర్ ఏరియా కమిటీలో పనిచేసిన జంపన్న లొంగిపోక ముందు వరకు ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రభాద్యతలు చూశారు. కేంద్ర కమిటీలో కూడా కీలక పాత్ర పోషించారు.
కీలక వ్యక్తి లొంగుబాటు....
984 ఏటూరు నాగారం దళ సభ్యుడిగా మావోయిస్టు పార్టీలో చేరిన జంపన్న అతి తక్కువ సమయంలోనే కీలక పదువులు చేపట్టాడు. 1985 నుంచి 90 వరకు ఏరియా కమిటీ మెంబర్, 1991 నుంచి 92 వరకు నార్త్ తెలంగాణా పారెస్ట్ డివిజన్ కమిటీ మెంబర్ గా చెలామణి అయ్యాడు. 1992 నుంచి 94 వరకు జిల్లా సెక్రటరీ గా తదనంతరం రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. 2007 నుంచి 17 వరకు దండకారణ్యం చత్తీస్ గడ్ ఒడిస్సా బోర్డర్(సిఓబి) లో కీలక పదవుల్లో చురుగ్గా పాల్గొన్నాడు..మొత్తం ఇతని మీద 100 కేసులు ఉండగా ఒక్క తెలంగాణాలో 51 కేసులున్నాయి.అనేక పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులను చంపి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 2009 లో నార్త్ జోన్ తెలంగానా కమిటీలో జోన్ ప్రెస్ టీంగా పనిచేస్తున్న రజిత ను పెళ్లిచేసుకున్నాడు. జంపన్న పై 25 లక్షలు, 5 లక్షలు రజిత పై రివార్డు ఉందని డీజిపి మహేందర్ రెడ్డి వెళ్ళడించారు. మావోయిస్టు పార్టీలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 135 మంది పని చేస్తున్నారని, సెంట్రల్ కమిటీలో 18 మంది అగ్రనేతలున్నారని వివరించారు. ఇందులో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా, ఇద్దరు ఆంధ్రప్రాంతానికి చెందిన వారున్నారని వీరంతా జంపన్న బాటలో జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు..గత కొంత కాలంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పార్టీ ప్రణాళికలు మారకపోవడమే జంపన్న లొంగిపోవడానికి ప్రధాన కారణం. మరోవైపు వయసు పెరుగుతుండటంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జంపన్న విషయం తెలుసుకున్న పోలీసులు సరెండర్ అయ్యే విధంగా చర్చలు జరిపారు. దీంతో జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్దమయ్యారు జంపన్న, రజిత. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలు సంతృప్తిగా లేవని మళ్ళీ పార్టీలోకి వెళ్లనని జంపన్న చెబుతున్నారు. ముందస్తుగా పార్టీ హై కమాండ్ కు లిఖిత పూర్వకంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసి వారి సూచనల మేరకే లొంగిపోయానని చెబుతున్నారు జంపన్న. ఇదిలా ఉంటే మరో మావోయిస్ట్ సభ్యురాలు పంచం పద్మా అలియాస్ సావిత్రి నిర్మల్ ఎస్ పి ఎదుట లొంగిపోయారు. అగ్రనేతలంతా లొంగుబాటు వైపు చూడటంతో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ లో పూర్తిగా బలహీన పడుతోందనే చెప్పొచ్చు..
- Tags
- మావోయిస్టు

