Wed Mar 25 2026 16:18:56 GMT+0530 (India Standard Time)
మరోసారి టీడీపీపై పవన్ ఫైర్

మరోసారి తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. వామపక్షాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సర్కార్ వద్ద నిధులు లేవంటూనే అనవసర ఖర్చు పెట్టిందన్నారు. పుష్కరాలు, కుంభమేళాల పేరుతో నిధులన్నింటినీ దుర్వినయోగం చేసిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల కోసమే నిర్మిస్తున్నట్లుగా ఉందని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర వచ్చిన వారికి ఏపీ రాజధానిలో అవకాశమే లేకుండా చేశారన్నారు. విభజన హామీల అమలు విషయంలో జనసేన వామపక్షాలతో కలిసి ఆందోళనకు దిగుతుందని చెప్పారు. వెనకబడిన జిల్లాల నుంచే ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు సీపీఎం, సీపీఐ నేతలు చెప్పారు.
Next Story

