మరికాసేపట్లో రజనీ ప్రకటన ఇలా ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ప్రకటన సంచలనం కానుందా? మరికొద్దిసేపట్లో ఆయన అభిమానులతో తన మనసులోని మాటను వెల్లడించనున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసింది. అయితే గత ఐదు రోజులుగా రజనీకాంత్ తన అభిమాన సంఘాలతో సమావేశమవుతున్నారు. అభిమానులతో తొలిరోజు సమావేశంలోనే తాను రాజకీయంపై ఈనెల31వ తేదీన ప్రకటన చేస్తానని చెప్పారు.
ఆసక్తిగా ఎదురు చూపులు...
తమిళనాడు వ్యాప్తంగా రజనీఅభిమానులు ఆయన నోటి నుంచి వచ్చే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు అభిమానులతో సమావేశం ఆఖరిరోజు కావడంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయనున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ఈరోజు అభిమానుల సమక్షంలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారన్న దానిపైన ప్రకటించకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రజనీ రెడీ అవుతున్నారని ఆయన సన్నిహితులు ఇప్పటికే చెబుతున్నారు.
రాజకీయాల్లోకి వస్తానని....
తమిళనాడులో ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పట్ల ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేయవచ్చన్నది అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానులతో చివరి రోజు కావడంతో కేవలం రజనీ అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సయితం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
- Tags
- రజనీకాంత్

