Mon Apr 06 2026 03:57:39 GMT+0530 (India Standard Time)
మంత్రి హరీశ్ సెల్ ఫోన్ ఎక్కడుందో తెలుసా...!

సెల్ ఫోన్ పోతే ఎంత బాధ ఉంటుంది. ఎన్ని నెంబర్లు మిస్ అవుతాయి. అపురూపంగా చూసుకునే ఆపిల్ సెల్ ఫోన్ పోతే ఇంకేముంటుంది... మంత్రి హరీశ్ రావుకు అదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో వెళ్లిన హరీశ్ తన సెల్ ఫోన్ ను ఎక్కడో పోగొట్టుకున్నారు. కన్నెపల్లిలో పంప్ హౌస్ లిఫ్ట్ సిస్టంను పరిశీలిస్తుండగా ఫోన్ మిస్సయింది. అయితే హరీశ్ రావు అప్పుడు గమనించలేదు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన సెల్ ఫోన్ మిస్ అయినట్లు తెలుసుకున్నారు. వెంటనే సెక్యురిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గన్ మెన్లు తిరిగి కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి వెతికినా అది కన్పించలేదు. దీంతో హరీశ్ రావు దిగాలు పడ్డారు. ముచ్చటపటి కొనుక్కున్న ఆపిల్ ఫోన్ పోవడంతో పాటు ముఖ్యమైన నెంబర్లన్నీ మిస్ అవడం ఆయనను బాధించింది.
- Tags
- మంత్రి హరీశ్
Next Story

