Wed Apr 01 2026 21:55:00 GMT+0530 (India Standard Time)
మంత్రి దేవినేని ఉమపై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ మంత్రి దేవినేని ఉమాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని సమీపంలో ఉన్న తమ భూమిని ఇవ్వాలంటూ దేవేనేని ఉమ, అతని సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ సురేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవినేని కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను అనేకసార్లు బెదిరించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఎప్పుడో కట్నంగా ఇచ్చిన భూమిని కబ్జా చేయాలని దేవినేని సోదరులు ప్రయత్నిస్తున్నారని సురేష్ ఆరోపిస్తున్నారు. తమను అక్కడకు పిలిపించి తన భార్యను కొట్టారని కూడా సురేష్ ఫిర్యాదు చేశారు. అమరావతి లో ఇప్పుడు భూములకు రెక్కలు రావడంతో వీలయితే సెటిల్ మెంట్ లేకుంటే బెదిరింపులకు దిగుతున్నారని వారు చెబుతున్నారు.
- Tags
- దేవినేని ఉమ
Next Story

