భారత్ లో అవినీతి పెరిగిందా?

భారతదేశంలో అవినీతి పెరిగిపోయింది. గతంలో కంటే అవినీతి హెచ్చుమీరిపోయినట్లు సర్వేలో వెల్లడయింది. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో 45 శాతం మంది లంచం ఇచ్చినట్లు తేలింది. గత ఏడాది సర్వేలో ఈ శాతం 43 మాత్రమే. అంటే ఏడాదిలో లంచం ఇచ్చే వారి సంఖ్య రెండు శాతం పెరిగినట్లు తేలింది. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. కనీసం ఒకసారైనా లంచం ఇచ్చినట్లు 45 శాతం మంది సర్వేలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సి వస్తుందని, లంచం ఇవ్వకుంటే ఫైలు కూడా కదలని పరిస్థితి నెలకొందని ఎక్కువ మంది అభప్రాయపడ్డారు.
పశ్చిమబెంగాల్ , మధ్యప్రదేశ్ లో ఎక్కువ.....
మొత్తం 11 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో మొత్తం 34,696 మంది పాల్గొనట్లు ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. అవినీతి తగ్గిందన్నవారు కేవలం 14 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. యోగి ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో అవినీతి తగ్గిందని 21 శాతం మంది చెప్పారు. మహారాష్ట్రలో అవినీతి పెరిగిందని 18 శాతం మంది అభిప్రాయపడగా, లేదని 64 శాతం మంది చెప్పారు. ఎక్కువగా స్థానికసంస్థల్లోనే ఈ అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రజలు తమ అభిప్రాయం ద్వారా సర్వేలో వెల్లడించారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, రెవెన్యూ, పోలీస్ విభాగంలో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
- Tags
- అవినీతి

