Mon Apr 06 2026 10:48:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హీరో విశాల్ అరెస్ట్

హీరో విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే నగర్ ఉప నియోజకవర్గంలో విశాల్ వేసిన నామినేషన్ ను తిరస్కరించడంతో విశాల్ హుటాహుటిన ఎన్నికల అధికారుల వద్దకు వచ్చారు. తాను నామినేషన్ పత్రాల్లో ఎలాంటి తప్పు చేయలేదని, ఎందుకు తిరస్కరించారో చెప్పాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇది రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులు ఎంత సర్దిచెప్పినా వినిపించుకోకుండా ధర్నాకు దిగడంతో పోలీసులు హీరో విశాల్ ను అరెస్ట్ చేశారు. విశాల్ ను అరెస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అయితే విశాల్ తన నామినేషన్ తిరస్కరణపై కోర్టుకు వెళతానని చెబుతున్నారు.
- Tags
- విశాల్
Next Story

