Sat Dec 06 2025 02:26:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : స్పీకర్ వార్నింగ్ ఇచ్చినా

పదిరోజులుగా ఏం జరుగుతుందో అదే ఈరోజు లోక్ సభలోజరిగింది. సభ ప్రారభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరి జలాలపై బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినదించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. ఆందోళనలు విరమించకుంటే సభను నిరవధికంగా వాయిదా వేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు. అయినా కూడా అన్నాడీఎంకే సభ్యులు వినకపోవడంతో మధ్యాహ్నం 12గంటలకు సభను వాయిదా వేశారు.
Next Story
