Thu Mar 19 2026 06:09:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సెప్టంబరులోనే అభ్యర్థుల ప్రకటన

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులుండవని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎదుర్కొంటామన్నారు. సెప్టంబరు లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సెప్టంబరు 2వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పెట్టనున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేస్తామన్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. కేశవరావు ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు నియోజకవర్గాల బాధ్యులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు.
Next Story

