Thu Apr 09 2026 16:12:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ :శశికళ వర్గానికి షాక్

రెండాకుల గుర్తును పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో దినకరన్, శశికళ వర్గానికి షాక్ తగిలినట్లయింది. అన్నాడీఎంకే గుర్తు రెండాకుల గుర్తు. దీనిపై రెండు వర్గాలు గుర్తు తమకే కేటాయించాలని ఎన్నికల సంఘం వద్ద పంచాయతీ పెట్టారు. లారీల్లో అఫడవిట్లు రెండు వర్గాలూ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి తరలించాయి. దీనిపై విచారించిన ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికే చెందుతుందని, అలాగే రెండాకుల గుర్తు కూడా ఆ వర్గానికే కేటాయిస్తున్నట్లు ఈసీ తెలిపింది.
- Tags
- శశికళ
Next Story

