Thu Mar 26 2026 05:57:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : శశికళకు పెరోల్ మంజూరు

బెంగళూరు పరప్పణ అగ్రహారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు పెరోల్ లభించింది. శశికళ భర్త నటరాజన్ ఈరోజు తెల్లవారు ఝామున మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శశికళకు పెరోల్ మంజూరయింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి తంజావూరు బయలుదేరి వెళ్లనున్నారు. నటరాజన్ స్వగ్రామమైన వల్లూరులో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. శశికళ 1975లో నటరాజన్ ను వివాహం చేసుకున్నారు. శశికళకు పదిరోజులు మాత్రమే పెరోల్ మంజూరయ్యే అవకాశముంది.
- Tags
- శశికళ
Next Story

