Thu Mar 26 2026 14:57:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వ్యూహం మార్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. నిన్న శాసనసభలో కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతిస్తామని తెలిపిన చంద్రబాబు ఒక్కసారిగా వ్యూహం మార్చారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆర్థిక నేరగాడు పెట్టిన అవిశ్వాసానికి మనం మద్దతివ్వడమేంటని ప్రశ్నించారు. జగన్ అవిశ్వాసం పెడితే మనమెందుకు మద్దతివ్వాలన్నారు. టీడీపీయే అవిశ్వాసం పెట్టాలని లోక్ సభలో టీడీపీ నాయకుడు తోట నరసింహంను ఆదేశించారు. ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చంద్రబాబు చెప్పేశారు. ఎన్డీఏకు టీడీపీ ఈరోజు గుడ్ బై చెబుతుందనటానికి చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనం. టీడీపీయే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని తాజాగా నిర్ణయించింది.
- Tags
- చంద్రబాబు
Next Story

