Thu Mar 26 2026 02:25:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యేకు సుప్రీంలో చుక్కెదురు

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది.ఎన్నికల అఫడవిట్ లో భార్యను గృహిణిగా చూపారంటూ వెంకటరమణరాజు అనే వ్యక్తి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల అఫడవిట్ లో తన ఆదాయ వనరులను సరిగా చూపకపోవడం, భార్యను ఒక చోట ఎండీగా, మరొకచోట గృహిణిగా చూపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గతంలో ఈ కేసును హైకోర్టు కొట్టివేయగా, వెంకటరమణ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును తిరిగి విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది.
Next Story

