Thu Mar 26 2026 16:16:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎంపీని పవన్ పిలిచి....?

వైసీపీకి చెందిన ఎంపీ వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ మధ్య తనకు పవన్ ఫోన్ చేసి పిలిస్తే వెళ్లానన్నారు. తనను వైసీపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని పవన్ అడిగారన్నారు. అయితే అందుకు తాను అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నందునే విమర్శిస్తున్నామని చెప్పానని వరప్రసాద్ తెలిపారు. అందుకు పవన్ స్పందిస్తూ తాను టీడీపీకి మద్దతివ్వబోనని, ఎన్నికల అనంతరం వైసీపీతోనే తాను కలిసి వస్తానని పవన్ తనతో చెప్పారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం జనసేన, వైసీపీ కలిసి పనిచేస్తాయని వరప్రసాద్ చెప్పారు.
Next Story

