Thu Mar 26 2026 16:13:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీకి టీడీపీ మద్దతివ్వాలని నిర్ణయం

వైసీపీకి టీడీపీ మద్దతివ్వాలని నిర్ణయించింది. వైసీపీ రేపు లోక్ సభలో పెట్టబోయే అవిశ్వాసానికి మద్దతివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. చంద్రబాబు దాదాపు రెండు గంటల నుంచి మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్రం అనుసరిస్తున్నతీరుతో పాటు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైనా చంద్రబాబు మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నారు. వైసీపీ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మనమెందుకు మద్దతివ్వాలని కొందరు మంత్రులు చంద్రబాబును ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల్లో ప్రతి చర్యకు మద్దతివ్వాలని చంద్రబాబు చెప్పారు. సో...రేపు వైసీపీ పెట్టబోయే అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Next Story

