Fri Mar 27 2026 05:32:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లోక్ సభ సోమవారానికి వాయిదా

లోక్ సభలో ఆందోళనలు సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. సభ తొలుత ఉదయం ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ, వైసీపీ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ ఎంపీలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారానికి వాయిదా వేశారు.
- Tags
- లోక్ సభ
Next Story

