Thu Mar 26 2026 13:33:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లోక్ సభ సోమవారానికి వాయిదా

లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన వెంటనే ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు తొలుత స్పీకర్ సుమిత్రామహాజన్ వాయిదా వేశారు. అయితే తిరిగి 12గంటలకు ప్రారంభమైనా సభలో గందరగోళం పరిస్థితులు నెలకొని ఉండటంతో స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. అవిశ్వాసం పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తమకు అందాయని, దీనిపై చర్చ చేపట్టాలంటే శాంతించాలని కోరారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ, టీడీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఇక సోమవారం చర్చకు వచ్చే అవకాశముంది. సభను ఆర్డర్ లో పెట్టాలని సుమిత్రా మహాజన్ పదే పదే విజ్ఞప్తులు చేసినా కుదరకపోవడంతో ఆమె సోమవారానికి వాయిదా వేశారు.
- Tags
- లోక్ సభ
Next Story

