బ్రేకింగ్ : లోక్ సభ రేపటికి వాయిదా

లోక్ సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమయింది. అన్నాడీఎకే సభ్యులు తమ ఆందోళనను విరమించలేదు. కావేరీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళనల మధ్యనే సభా కార్యక్రమాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్నా నినాదాలను అన్నాడీఎంకే సభ్యులు ఆపలేదు. దీంతో కేంద్రమంత్రి అనంతకుమార్ సభ్యులు శాంతించాలని, అవిశ్వాసంపై హెడ్ కౌంట్ చేయాలని కోరారు. తాము అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని అనంతకుమార్ ప్రకటించారు. అవిశ్వాసం ఇచ్చిన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం నోటీసులను స్పీకర్ చదివి విన్పించారు. అవిశ్వాసంపై యాభై మంది కంటే ఎక్కువ మంది సభ్యులే మద్దతు తెలుపుతున్నారని, వెంటనే చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. అయినా సభ ఆర్డర్ లో లేనందున తాను ఏమీ చేయలేనని స్పీకర్ పదే పదే చెప్పారు. లోక్ సభ ఆర్డర్ లో లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
