Sat Mar 28 2026 00:09:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లెప్ట్ కు గట్టి ఎదురుదెబ్బ

దాదాపు ఇరవై అయిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వామపక్ష పార్టీ కంచుకోటకు బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలో సీపీఎం ఎన్నికలకు వెళ్లింది. ఓటింగ్ సరళిని చూస్తే బీజేపీ ఖచ్చితంగా త్రిపురలో అధికారంలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. 59 స్థానాలకు త్రిపురలో ఎన్నికలు జరగ్గా బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా వామపక్ష పార్టీ కేవలం20 స్థానాల్లోనే మెజారిటీలో ఉండటం విశేషం. త్రిపురలో ఇతర పార్టీలు ఖాతా కూడా తెరవని పరిస్థితి. ఇప్పుడున్న ట్రెండ్స్ ను చూస్తే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా దాటే అవకాశముంది.
- Tags
- త్రిపురలో బీజేపీ
Next Story

