Sun Apr 12 2026 13:58:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ లు ఎందుకు? లోకేష్ అసహనం

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్నదంతా మీడియా సృష్టేనని మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు చెప్పకపోయినా.. మీడియా బ్రేకింగ్ లు మీద బ్రేకింగ్ లు వేసి అలజడి సృష్టిస్తుందన్నారు. మీకు ఇష్టమొచ్చిన బ్రేకింగ్ లు వేసుకుని మమ్మల్ని సమాధానం చెప్పమంటే ఎలా? అని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం రేవంత్ కోర్టు పనిమీదనే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తుందన్నారు లోకేష్. తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్ ఎక్కడా చెప్పకపోయినా మీడియా ఇష్టంవచ్చినట్లు బ్రేకింగ్ లువేయడంపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.
- Tags
- లోకేష్
Next Story

