Mon Mar 30 2026 08:06:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రెండో వన్డే కూడా మనదే...!

దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో వన్డేలో కూడా భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లను భారత్ బౌలర్లు తిప్పేశారు. ముఖ్యంగా స్పిన్నర్ల దెబ్బకు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. స్పిన్నర్ల దెబ్బకు సౌతాఫ్రికా 118 పరుగులకే కుప్ప కూలిపోయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిలకడగా ఆడింది. రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ కోహ్లీ, ధావన్ నిలకడగా ఆడి భారత్ ను 20.2 ఓవర్లలోనే గెలిపించడం విశేషం. 9 వికెట్ల తేడాతో రెండో వన్డే కూడా భారత్ ఖాతాలో పడింది.
- Tags
- క్రికెట్
Next Story

