Wed Mar 25 2026 21:49:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజ్యసభలోనూ అంతే...సోమవారానికి వాయిదా

రాజ్యసభ ప్రారంభమయిన కొద్దిసేపు బిజినెస్ జరిగింది. అయితే వెంటనే సభ్యులు ఆందోళనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదేపదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు ఆందోళన ఆపలేదు. సభ్యుల నినాదాల మధ్యనే కొన్ని బిల్లులు ప్రవేశపెట్టిన వెంకయ్యనాయుడు తానేమీ చేయలేనని, సభ ప్రారంభమయిన తొలి రోజు నుంచీ చెబుతున్నానని, అన్ని అంశాలపై సభలో చర్చిద్దామని చెప్పినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు శాంతించక పోవడంతో రాజ్యసభను సోమవారానికి వాయిదా వేశారు.
Next Story

