బ్రేకింగ్ : యుద్ధం తప్పదన్న చంద్రబాబు

పార్లమెంటులో గట్టిగా పోరాడాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సభ నుంచి సస్పెండ్ చేసినా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. విభజన హామీలు అమలయ్యే వరకూ పార్లమెంటులో యుద్ధం చేయాలని టీడీపీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లో చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసనల రూపంలో తెలియజేయాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను చెప్పే విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. మోడీ ఫొటో పెట్టలేదన్న బీజేపీ వ్యాఖ్యలను తిప్పికొట్టేలా ప్రచారం చేయాలని కోరారు. మిత్రపక్షంగా గౌరవించకపోతే ఇక ఆందోళన తప్పదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేంత వరకూ పోరాటం చేయాలన్నారు.
పార్లమెంటులో నిరసనలు.....
అయితే కొందరు ఎంపీలు రాజీనామాలు చేయాలని సూచించగా అందుకు చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామాలతో సాధించేదేమీ లేదని, సమయం వచ్చినప్పుడు ఆ పనిచేయవచ్చని సూచించారు. సభలో నిరసనలు, ఆందోళనును చేసి విభజన హామీలను నెరవేర్చుకోవడమే ముందున్న కర్తవ్యమన్నారు. కేంద్రంతో సఖ్యతగానే మెలుగుతూ పోరాటం సాగించాలన్నారు. అయితే కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రం కేంద్రం పెద్దలు టచ్ లో ఉన్నారని చెప్పారు. ప్రతిసారీ పార్లమెంటు సమావేశాలు జరిగే ముందులాగే ఈ సమావేశం జరిగిందన్నారు సుజనా. బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం, రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీ నిధులు, అమరావతి నిర్మాణం కోసం నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే కొద్దిరోజులు కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరిపి హామీలు అమలయ్యేలా చూడాలన్నదే చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించారు.
- Tags
- టీడీపీపీ సమావేశం

