Sun Apr 12 2026 03:20:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పాదయాత్రకు ముందే జగన్ కు ఎదురుదెబ్బ

వైసీపీ అధినేత జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని తేలిపోయింది. జగన్ పిటిషన్ పై శుక్రవారమే విచారణ ముగిసినా ఈరోజు తీర్పును సీబీఐ కోర్టు ప్రకటించింది. దీనికిప్రత్యామ్నాయ మార్గాలను వైసీపీ నేతలు అన్వేషించే పనిలో పడ్డారు. నవంబరు 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది.
- Tags
- జగన్
Next Story

