Wed Apr 01 2026 01:34:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పద్మావత్ కు తొలిగిన చిక్కులు

వివాదస్పదంగా ఉన్న పద్మావత్ సినిమా విడుదలకు మార్గం సుగమమయింది. పద్మవత్ సినిమాకు చిక్కులు తొలిటిపోయాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్ సినిమా విడుదలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. దీనిపైనిషేధం విధించాయి. దీంతో సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేయాలని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని చెప్పింది. పద్మావత్ సినిమా నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పును వెలువరించింది. ఈ నెల 25న పద్మావత్ సినిమా విడుదల కానుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఈ చిత్రాన్ని అక్కడి ప్రభుత్వాలు నిషేధించాయి. ఆ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.
- Tags
- పద్మావత్
Next Story

