బ్రేకింగ్ : నిజమైన దీపావళి మాకు అప్పుడే - ముద్రగడ

కాపు రిజర్వేషన్లపై కాపు ఉద్యమ నేత ముద్రగడ స్పందించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినంత మత్రాన ఒరిగేది లేదన్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చిన రోజునే తమకు నిజమైన దీపావళి అని ముద్రగడ చెప్పారు. ఐదు శాతం రిజర్వేషన్లు కూడా ఆమోదయోగ్యం కాదన్నారాయన. ఎవరూ వేడుకలు జరుపుకోవద్దనికోరారు. అది మిగిలిన కులాల వారికి బాధ కల్గిస్తుందన్ానరు. తనపై చంద్రబాబు, ఆయన అనుచరులు అనవసరంగా అభాండాలు వేశారని ముద్రగడ ఆరోపించారు. తాను ఇచ్చిన హామీలు మాత్రమే అడిగానని, అయితే దానికి తన మీద జగన్ మనిషినని ముద్రవేశారన్నారు. తరచూ టీడీపీ నేతలు తనపై ఇలాంటి ఆరోపణలను ఉపసంహరించుకోవాలన్నారు. ‘నా కారెక్టర్ ఏంటో మీకు తెలుసు. ఉద్యమం చేస్తంటే నా కారెక్టర్ ను తప్పు పట్టించే ప్రయత్నం చేయడం మంచిపద్ధతి కాదన్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కూడా నేను పనిచేశాను. ఏ రోజూ నేను రూపాయి ఆశించలేదు.’ అని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఏ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఏరోజూ చంద్రబాబును అడగలేదన్నారు. మనసును క్షోభ పెట్టే మాటలను మీ అనుచరుల చేత మాట్లాడించవద్దని ముద్రగడ హితవు పలికారు.
- Tags
- ముద్రగడ

