Sat Apr 11 2026 12:52:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీలో మరో వికెట్ అవుట్

అనుకున్నట్లే జరగుతుంది. తెలంగాణ టీడీపీలో ఎక్కువ మంది నేతలు రేవంత్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి వెంట ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాకు దారితీసిన కారణాలను కూడా వివరించారు. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క తొలుత ఎర్రబెల్లి దయాకర్ వర్గంలో ఉన్నారు. దయాకర్ రావు పార్టీ వీడినప్పుడు కూడా సీతక్క టీఆర్ఎస్ లోకి వెళతారని అందరూ భావించారు. కాని అనూహ్యంగా రేవంత్ వెంటనే టీడీపీలో కొనసాగుతానని చెప్పారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సీతక్క రెడీ అయిపోయారు. రాహుల్ సమక్షంలో రేవంత్ వెంట ఈరోజు ఢిల్లీలో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
- Tags
- సీతక్క
Next Story

