Mon Apr 06 2026 23:43:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జేసీ సంచలన ప్రకటన

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని జేసీ స్పష్టం చేశారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులకు విలువ లేకుండా పోయిందని జేసీ ఆవేదన చెందారు. తన కుమారుడికి అవకాశమిస్తే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారని చెప్పారు. అయితే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి ఈరోజు టీడీపీ లోచేరుతున్నారని, ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో ఎవరూ పనిచేయరని, నేతలంతా చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story

